రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి : వైఎస్సార్ జిల్లా అదనపు ఎస్సీ - ysr District road accident
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 1:30 PM IST
Police Organized Road Accident Awareness Rally in YSR District : ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని వైఎస్సార్ జిల్లా అదనపు ఎస్సీ సుధాకర్ పేర్కొన్నారు. ఈ విషయమే ఇటీవల పలు సర్వేలు కూడా వెల్లడించాయని తెలిపారు. 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని కడప ఆర్టీసీ పోలీస్ రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ ట్రాఫిక్ స్టేషన్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు కొనసాగింది. పోలీస్ అధికారులు, నగరవాసులు ప్లకార్డులతో రోడ్డు నిబంధనలు పాటించాలంటూ నినాదాలు చేశారు.
ప్రమాదం వల్ల ఓ వ్యక్తి చనిపోతే బాధిత కుటుంబం మొత్తం రోడ్డు పడుతుందని ప్రజలకు సుధాకర్ తెలిపారు. చాలా మంది రోడ్డు ప్రమాదాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని, ఒకరి నిర్లక్ష్యం మరొకరి శాపం అవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ముఖ్యంగా బైక్ మీద వెళ్లే వారు హెల్మెట్‌ను, కారు వాహనదారులు సీటు బెల్టు ధరించి వాహనాన్ని నడపాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని పేర్కొన్నారు.