'వైఎస్సార్ ఆసరా' కార్యక్రమానికి వెళ్లకుండా కాలవ శ్రీనివాసులుకు నోటీసులు - ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 2:12 PM IST

Police Issued 41-A Notice to TDP Leader Kalava Srinivas : అనంతపురం జిల్లాలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం (YSR Asara Program) రోజురోజుకు రసాభాసగా మారుతోంది. మంగళవారం కనేకల్ మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాయదుర్గం వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రసంగం మొదలు పెట్టగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అవమానంగా భావించిన ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలే కావాలని విద్యుత్ సరఫరా నిలిపివేశారని మండిపడ్డారు. ఈరోజు జరగబోయే కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవడంతో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కార్యక్రమానికి హాజరవుతానంటూ కాలవ ప్రకటించడంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే,

ఏ హోదాలో హాజరవుతారు : జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గుమ్మగట్ట మండల కేంద్రంలో జరగబోయే వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి తాను హాజరవుతానని కాలవ శ్రీనివాసులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాలవ శ్రీనివాసులును కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాలవకు 41-A నోటీసులు జారీ చేశారు. రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డికి ఏ హోదాలో ఆసరా కార్యక్రమానికి ఆహ్వానిస్తారంటూ అధికారులను కాలవ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. మెట్టు గోవిందరెడ్డి వస్తే తాను మాజీ ఎమ్మెల్యే హోదాలో ఆసరా కార్యక్రమానికి వస్తానని డీఆర్​డీఏ పీడీకి కాలవ శ్రీనివాసులు చెప్పారు. దీంతో ఆయన ఇంటివద్ద పోలీసులు మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.