పోలింగ్ రోజు అల్లర్లు - 50 మందిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - police arrested for palnadu rioters - POLICE ARRESTED FOR PALNADU RIOTERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 10:20 PM IST

Police Arrested Rioters on Polling Day in Palnadu District : పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గురజాల నియోజకవర్గం దాచేపల్లి, తంగేడు ఘర్షణల కేసుల్లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన రెండు పార్టీలకు చెందిన 50 మందిని అరెస్టు చేశారు. హింసాత్మక ఘటనలకు కారకులైన వారిని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు.

అయితే ఎన్నికల వేళ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటంతో పాటు ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొన్ని వాహనాల్ని తగులబెట్టారు. ప్రతిచర్యగా టీడీపీ వర్గీయులు రోడ్లపైకి వచ్చి వైఎస్సార్సీపీకు చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు. ఈ రెండు ఘటనలపైనా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఘర్షణలకు సంబంధించి ఇరు పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల రోజు, ఆ తరువాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఘర్షణలు జరుగుతున్న సమయంలో లభించిన వీడియోల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.