LIVE : పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం - PM Modi LIVE
🎬 Watch Now: Feature Video
Published : Mar 5, 2024, 10:15 AM IST
|Updated : Mar 5, 2024, 12:29 PM IST
PM Modi Sangareddy Tour Live Today : రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రూ.9 వేల కోట్లతో చేపట్టే వివిధ కార్యక్రమాలకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తున్న ప్రధాని, పలు అభివృద్ధి పనులను జాతికి అంకితం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్రెడ్డి వర్చువల్గా హాజరయ్యారు. అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని నరేంద్ర మోదీ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత, బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లాకు బయలుదేరారు. అదే వేదికగా రూ.1,409 కోట్లతో చేపట్టిన హైవేను ప్రారంభించారు. నాందేడ్-అఖోలా ఎన్‌హెచ్-161ను జాతికి అంకితం చేశారు. అనంతరం పటాన్‌చెరులో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభకు హాజరుకానున్నారు. ఈ సభా వేదికగా ప్రధాన మంత్రి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారం యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. మోదీ పర్యటన సందర్భంగా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Last Updated : Mar 5, 2024, 12:29 PM IST