LIVE విజయవాడలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో - ప్రత్యక్ష ప్రసారం - PM Modi Road Show in Vijayawada - PM MODI ROAD SHOW IN VIJAYAWADA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 8, 2024, 7:04 PM IST
|Updated : May 8, 2024, 8:11 PM IST
PM Modi Road Show in Vijayawada Live: ఏపీ రెండో విడత ఎన్నికల ప్రచారంలో రెండోరోజు ప్రధాని మోదీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని పీలేరులో మోదీతో కలిసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడిన ప్రధాని ఎన్డీఏది అభివృద్ధి మంత్రం అయితే, వైఎస్సార్సీపీది అవినీతి తంత్రం అని అన్నారు. ఏపీలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను జగన్ ప్రభుత్వం అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి వైఎస్సార్సీపీ సర్కార్ భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం ఇళ్లు ఇచ్చినా జగన్ నిర్మించలేదని ధ్వజమెత్తారు. ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూతపడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల చెరకు రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరకు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఏపీలో దేవాలయాలపై దాడులు జరిగాయని మోదీ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాలను రక్షిస్తామన్నారు. పీలేరు సభ అనంతరం విజయవాడ రోడ్ షోలో పాల్గొన్న మోదీ, చంద్రబాబు, పవన్ ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 8, 2024, 8:11 PM IST