ఫిరంగిపురంలో సీఎం జగన్ పర్యటన - చెట్లు నరికేసిన అధికారులు - జగన్ పర్యటన చెట్ల కొమ్మలు తొలగింపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 3:31 PM IST
Phirangipuram Public Fire on CM Jagan Tour : సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఉండే చెట్లు మనుగడ లేకుండా పోతున్నాయని గుంటూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిరంగిపురంలో ఈ నెల 15న జరిగే వాలంటీర్ల వందనం కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ హెలికాప్టర్లో సెయింట్ పాల్ హైస్కూల్లోని మైదానానికి చేరుకొని అక్కడ నుంచి బహిరంగ సభకు వెళ్లనున్నారు.
జగన్ పర్యటనను దృష్టిలో పెట్టుకొని రహదారికి అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలను తొలగించారు. ఇంత కాలం విద్యుత్ తీగలను పట్టించుకోని అధికారులు సీఎం రాకతో హఠాత్తుగా సరి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై గుంతలు తవ్వి బారికేడ్లును ఏర్పాటు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు ఎదురుగా బారికేడ్లను అడ్డుగా పెట్టడం వల్ల బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.