అనుభవాలను ఆలోచనలుగా మలచి - 'అంబి ది డాగ్ రిసార్ట్' నడిపిస్తున్న మహిళ - Pet Lover Vasantha Lakshmi
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 7:02 AM IST
Pet Lover Vasantha Lakshmi Interview : కరోనా సమయంలో తను ఎదుర్కొన్న సమస్య ఎవరికీ రావొద్దని తలచిందా యువతి. శునకాలపై తనకున్న ఇష్టంతో రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. వాటి ఆలనా, పాలనా అన్ని తానై చూసుకుంటోంది. అంబి ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలైన ఆమె ఇంటీరియర్ డిజైనర్‌గా రాణిస్తూ హైదరాబాద్ నగర శివారులో సొంతంగా "అంబి ది డాగ్ రిసార్ట్ పయనీర్" పేరిట ఓ రిసార్ట్స్ నెలకొల్పింది. పెట్ డే కేర్, బోర్డింగ్, స్పా, గ్రూమింగ్, ట్రైనింగ్ ఇస్తూ ఓ నిజమైన ఫ్రెండ్ మారి సేవలందిస్తోంది.
'Ambi The Dog Resort' For Dogs : భిన్న రకాల బ్రీడ్స్ అభివృద్ధి చేస్తూ పెట్స్‌తో అత్యంత స్నేహపూర్వకంగా మెలుగుతోంది. చాలా మంది దూర ప్రాంతాలు వెళ్లే సమయంలో శునకాల సంరక్షణ ఇబ్బంది కాకుండా ఈ కేంద్రంలో వదిలి వెళితే అన్ని బాగోగులు చూసుకుంటూ ఆడిస్తున్నారు. సమయాల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా వైద్య సేవలు అందించి ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో పెట్స్‌ను తమ సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఆమె అనుభవాల నుంచి వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టి వ్యాపారం చేస్తున్న రామదాసు వసంత లక్ష్మీతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం.