మైనార్టీలు, వ్యాపారులను ఎమ్మెల్యే రాచమల్లు మోసం చేశారు: యువకుడి సెల్ఫీ వీడియో వైరల్ - Person Selfie Video - PERSON SELFIE VIDEO
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 12:31 PM IST
Person Selfie Video Criticizing YSRCP MLA Sivaprasad Reddy Proddatur YSR District : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చర్యలతో మైనార్టీలు, చిరువ్యాపారులు రోడ్డున పడ్డారని ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మూడేళ్ల కిందట శివాలయం వద్ద ఉన్న కూరగాయల మార్కెట్‌ను పడగొట్టి చిరువ్యాపారులను ఎమ్మెల్యే రాచమల్లు కొన్ని వందల కుటుంబాలకు రోడ్డుపాలు చేశారని సెల్ఫీ వీడియో తీసిన అబ్దుల్లా అనే యువకుడు ఆరోపించాడు.
అనిబిసెంట్ మైదానంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసిన ప్రతి చిరువ్యాపారుల నుంచి వేల రూపాయలు వసూలు చేశారని అబ్దుల్లా సెల్పీ వీడియోలో ఆరోపించాడు. అక్కడ వ్యాపారం సరిగా జరగక వాళ్లు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అక్రమాలను ఎవరైన ప్రశ్నిస్తే వారి అక్రమ కేసులు బనాయిస్తారని పేర్కొన్నాడు. ప్రొద్దుటూరుకు ఎమ్మెల్యేగా ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశాడు. మైనార్టీలు, చిరువ్యాపారులు రాచమల్లుకు మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాడు.