సీఎం సభతో సామాన్యులకు తప్పని తిప్పలు - బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు - CM Jagan meeting in Vijayawada
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 11:21 PM IST
Peoples Facing Problems Due to CM Jagan Meeting : విజయవాడలో సీఎం సభ సామాన్యులకు కష్టాలను తెచ్చిపెట్టింది. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు కోనసీమ జిల్లా నుంచి 116 బస్సులు తీసుకెళ్లారు. దీంతో రావులపాలెం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం పరిధిలో బస్సుల కొరత ఏర్పడింది. బస్సులు లేక ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే వైఎస్సార్సీపీ సామాజిక న్యాయ సంకల్ప సభకు ఎప్పటిలాగే ప్రజలు మొహం చాటేశారు. సాక్ష్యాత్తు సీఎం జగన్ (CM Jagan ) పాల్గొన్న సభకు కూడా ప్రజలు అయిష్టంగానే వచ్చారు.
వచ్చిన జనం కూడా నేతల ప్రసంగం వినకుండానే వెనుదిరిగారు. జగన్ సభకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను భారీగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించారు. వీరంతా జగన్ ప్రసంగం వినకుండానే ఇంటి దారి పట్టడంతో స్టేడియం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. ప్రజలు గోడ దూకి వెళ్లిపోతుండడంతో పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కాగా సభకు వచ్చిన వారికి వైసీపీ నాయకులు స్టేడియం ఎదుట గల్లీలో మద్యం సరఫరా చేశారు. వారంతా మద్యం తాగి అక్కడే ఖాళీ బాటిళ్లను వదిలి వెళ్లారు. సభ కోసం పోలీసులు బందర్ రోడ్డులో రాకపోకలు నిలిపి వేయడంతో విజయవాడ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.