రూ.500 ఇచ్చి సభకు తరలింపు- వైసీపీ నేతలు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగిన ప్రజలు - People Left YSRCP Election Meeting - PEOPLE LEFT YSRCP ELECTION MEETING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 8:26 AM IST
People Left the YSRCP Election Campaign Meeting in Majjivalasa: విశాఖ జిల్లా భీమిలి మండలం మజ్జివలసలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ జనం లేక వెలవెలబోయింది. 4 రోజుల క్రితం మజ్జివలసలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు. ఈ పరాభవం నుంచి పార్టీని గట్టెక్కించే ఉద్దేశంతో గ్రామంలో వైసీపీ నేతలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ హాజరవుతుండటంతో సభకు జనాలను తరలించే ప్రయత్నం చేశారు.
ఓటర్‌కు 500 రూపాయలిచ్చి మరీ బహిరంగ సభకు తరలించారు. అనుకున్న సమయం కన్నా సభ ప్రారంభం ఆలస్యం కావటంతో ప్రసంగాలు పూర్తి కాకుండానే ప్రజలు ఇంటి ముఖం పట్టారు. జనాలు వెళ్లిపోకుండా చేసిన నేతల ప్రయత్నం వృథా అయ్యింది. దీంతో సభా ప్రాంగణం అంతా ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. జనం లేకపోయినా అవంతి శ్రీనివాసరావు, బొత్స, ఝాన్సీలు వారి ప్రసంగాన్ని కొనసాగించడం కొసమెరుపు.