'అప్పు ఎప్పుడు చెల్లిస్తారు' - ఫోన్ కాల్స్ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి గ్రామస్థులు - FAKE Calls Torcher Some Families - FAKE CALLS TORCHER SOME FAMILIES
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 12:56 PM IST
People are Getting Phone Calls That Taken Loans in Satyasai District : ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీని వాడుకుని కొందరు అమాయకుల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలు ఉంటే చాలు మీ పేరున లోన్లు తీసుకున్నారంటూ పదే పదే ఫోన్లు చేసి వేధిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గాండ్లపెంట మండలం వద్దిరెడ్డిపల్లిలో పలువురిని ఫోన్ కాల్స్ కలవర పెడుతున్నాయి.
రుణం తీసుకున్నట్లు దాదాపు 30 కుటుంబాలకు నెల రోజుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కుటుంబ సభ్యుల వివరాలను తెలుపుతూ తీసుకున్న అప్పు వడ్డీతో సహా చెల్లించాలంటూ ఫోన్ చేసి వేధిస్తుండటంలో గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ చేసి వ్యక్తిని గ్రామస్థులు ప్రశ్నించగా గ్రామ వాలంటీర్ మీ పేరుతో లోన్ తీసుకున్నాడని చెప్పారన్నారు. రుణం తీసుకున్నారని ఫోన్ చేసి వేధిస్తున్న అపరిచిత వ్యక్తులపై పోలీసులు స్పందించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.