పీసీబీ అధికారులతో పవన్ సమీక్ష - వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్‌కు నోటీసులు జారీ చేయాలని ఆదేశం - Pawan orders on Veerabhadra Exports - PAWAN ORDERS ON VEERABHADRA EXPORTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 5, 2024, 10:02 PM IST
Pawan Kalyan orders on Veerabhadra Exports: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ బోర్డు (Pollution Control Board) అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ మేరకు ఆదేశాలిచ్చారు. 15 రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని సంస్థకు ఆదేశాలిచ్చారు. కాలుష్యానికి సంబంధించి పవన్ కల్యాణ్‌కు గతంలో రైతులు వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సంస్థపై ఫిర్యాదు చేయగా, ఆ అంశంపై అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.
వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌కి చెందిన సంస్థ అని తెలిపారు. అది పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందని వివరించారు. కాకినాడ జిల్లా కరప మండలం గురజనాపల్లిలో వ్యర్థజలాలను బైపాస్ చేసి వదిలేస్తున్నారని చెప్పారు. రొయ్యల వ్యర్థాలనూ నిబంధనలు పాటించకుండా పడేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అధికారుల వివరణ విన్న పవన్‌కల్యాణ్, వీరభద్ర ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.