నెట్టింట వైరల్‌గా పవన్ కల్యాణ్ ఫ్యామిలీ ఫొటో - సో క్యూట్ అంటున్న నెటిజన్లు - Pawan Kalyan Family Rare Photo - PAWAN KALYAN FAMILY RARE PHOTO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 23, 2024, 10:28 PM IST
Pawan Family Pic Viral on Social Media : జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ అయిన ఓ ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో దిగిన పిక్ అది. అందులో పవన్ సతీమణి అనా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన ఆ అరుదైన ఫొటొ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Janasena Party Shared Pawan Family Photo : ఆ చిత్రం అంతలా ఆవిష్కృతమవడానికి ట్రాఫిక్ చిక్కులే కారణం అని తెలుస్తోంది. ఈ నెల 12న పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, ఫ్యామిలీతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి బయల్దేరారు. ఆ సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కాసేపు పవన్ సేద తీరారు. ఆ సమయంలో ఆయన కుటుంబంతో కలిసి ఫొటోకు దిగారు. దీనిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనుకోకుండా దిగిన చిత్రం కాస్త అరుదైన ఫొటోగా మారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.