'గుడ్ మార్నింగ్‌' పేరుతో ఆస్తులు స్వాహా - కేతిరెడ్డి అరాచకాలతో ప్రజలు విసిగిపోయారు : పరిటాల - Sriram criticised Kethireddy

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 12:46 PM IST

Paritala Sriram Comments on Dharmavaram MLA : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేస్తున్న అరాచకాలపై ప్రజలు విసిగిపోయారని తెలుగుదేశం ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆస్తులను స్వాహా చేస్తున్నారని విమర్శించారు. కేతిరెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు ధర్మవరంలో ఏ కాలనీకి వెళ్లి అడిగినా ప్రజలు చెప్తారని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరం చేశారని విమర్శించారు. అంతేగాక నగరంలో ఉన్న పలు కార్పొరేట్ విద్యాసంస్థలను ధర్మవరం నుంచి బెదిరించి పంపించారని శ్రీరామ్‌ ఆరోపించారు. ఈ  క్రమంలోనే సొంతంగా విద్యాసంస్థలు పెట్టి ప్రజల సొమ్మును దొచుకుంటున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం ప్రజలు కేతిరెడ్డికి బుద్ధిచెప్పడానికిి సిద్ధమయ్యారని తెలిపారు. 

అయితే కేతిరెడ్డిపై ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. భూకబ్జాలు, దౌర్జన్యాలు, ఇసుక, మట్టి, మైనింగ్‌ ఇలా అన్నింటిలోనూ ఆయన హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఆయన వద్దే కొనాలి. ప్రతి పనిలో, వ్యాపారంలో కమీషన్లు సమర్పించాల్సిందే. నాలుగున్నరేళ్లలో ఆయన అవినీతి సంపాదన రూ.వందల కోట్లు దాటిపోయాయని వైఎస్సార్సీపీ నేతల్లోనే చర్చ సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.