అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సర్పంచ్లు - bapatla district
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-02-2024/640-480-20670317-thumbnail-16x9-assembly-siege.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 5, 2024, 2:02 PM IST
Panchayati Raj Chamber Sarpanchula Association Assembly Calls for Siege : కేెంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాలు పంచాయతీలకు కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రయోజనాలకు కేటాయిస్తున్న విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సర్పంచ్లు ఈ రోజు (ఫిబ్రవరి 5న) అసెంబ్లీని ముట్టడికి కార్యచరణ రూపొందించారు. బాపట్ల జిల్లాలోని పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లా పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు మండలాల్లో సర్పంచులు, టీడీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కొంతమంది సర్పంచులు, నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా నాగులపాలెం సర్పంచ్ సుధారాణికి నోటీసులు అందజేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించవద్దని పోలీసులు జిల్లా సర్పంచులు, నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల ప్రగతి, రోజువారి పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్ భిక్షటన చేసే పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు.