తాడేపల్లి యూ-1 రిజర్వు జోన్ తొలగిస్తూ వైఎస్సార్సీపీ ఉత్తర్వులు - remove u1 zone due to elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 11:50 AM IST

Orders Removing On Tadepalli U-1 Reserve Zone: తాడేపల్లి U-1 రిజర్వు జోన్ రైతులను అయిదేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం హఠాత్తుగా వెనక్కి తగ్గింది. జోన్ తొలగించాలని కోరుతూ రైతులు 2022లో 146 రోజులు రిలే నిరాహార దీక్షలు చేసినా అప్పట్లో పట్టించుకోని ప్రభుత్వం వారిపై నిర్బంధాన్ని అములుచేసింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఆఘమేఘాలపై తాడేపల్లి మండలంలోని U-1 రిజర్వు జోన్‌పై (Reserve Zone) ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే U-1 జోన్ తీసేస్తామని నారా లోకేష్ (nara lokesh) హామీ ఇచ్చిందునే తాము పార్టీ చేరామని ఇంతలోనే U-1జోన్​పై ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందని రాజధాని రైతులు ఆరోపించారు.

యూ-1 జోన్: గత ప్రభుత్వ హయాంలో తాడేపల్లి మండలంలో 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్​గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎటువంటి రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలు జరగకుండా నిషేధం విధించారు. దీనిని రిజర్వ్ జోన్​గా ప్రకటించి ఇందులో వ్యవసాయం తప్ప ఇతర కార్యకలాపాలకు ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.