Ramoji Group Launched 121st Margadarsi Chit Funds Branch : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించటమే లక్ష్యంగా మార్గదర్శి ముందుకు సాగుతోందని రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ అన్నారు. గచ్చిబౌలిలోని స్కైసిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన మార్గదర్శి 121వ శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి చిట్ వేసిన జంపని కల్పన దంపతులకు రశీదు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి, సబల మిల్లెట్స్ డైరెక్టర్ సహరి, రామోజీరావు మనవడు సుజయ్, ఈటీవీ సీఈవో బాపినీడు పాల్గొన్నారు.
'మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్కు సంస్థ పెరుగుదలే లక్ష్యం. గ్రోత్ ఈజ్ ద వే అని అంటూ ఉండేవారు. వినియోగదారులకు సేవలు పెంచడం, సంస్థ పెరుగుదల, అదే మార్గదర్శి లక్ష్యం'- సీహెచ్ కిరణ్, సీఎండీ, రామోజీ గ్రూప్ సంస్థలు
వినియోగదారులకు ఎప్పుడూ అండగా మార్గదర్శి : ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, ఈనాడు ఏపీ ఎడిటర్ ఎం.నాగేశ్వర రావు, మార్గదర్శి సీఈవో సత్యనారాయణ సహా పలువురు ప్రముఖులు మార్గదర్శి 121వ శాఖ ప్రారంభోత్సవానికిి హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన కిరణ్, శైలజా కిరణ్ వినియోగదారులు తమ కలలను నిజం చేసుకునేందుకు మార్గదర్శి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. 60 ఏళ్లుగా చిట్స్ వేస్తున్న వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం సహా అందరికీ అందుబాటులో వివిధ రకాల చిట్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు.
'వ్యాపారంలో చిన్న చీటీతో మొదలు పెట్టి ఇవాళ దాదాపు రెండు, మూడు కోట్ల రూపాయల వరకు చీటీలు వేసుకుంటున్నారు. ఒక్కసారి చీటీ పాడిన తర్వాత వాళ్లకు ముందే వివరిస్తాం. రెండు, మూడు వారాలకే వారు డబ్బులు ఈజీగా తీసుకుంటున్నారు. భారతదేశంలో మార్గదర్శి నంబర్ వన్ చిట్ ఫండ్ సంస్థ'- శైలజా కిరణ్, మార్గదర్శి ఎండీ
అంచెలంచెలుగా విస్తరణ - నమ్మకానికి చిరునామాగా 'మార్గదర్శి'
మార్గదర్శి మరో మూడు శాఖలు - వర్చువల్గా ప్రారంభించిన ఎండీ శైలజా కిరణ్