నందిగామలో డివైడర్ నిర్మాణం - తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ - Opposition Leaders Protest
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 6:05 PM IST
Opposition Leaders Protest Against Road in Nandigama : నందిగామ పట్టణం పాత బైపాస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి భారత టాకీస్ వరకు డివైడర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలను, నాణ్యత లోపాలను పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరిశీలించారు. నందిగామ పాత బైపాస్, చిన్న మసీదు రోడ్డు భారత టాకీస్ రోడ్డు నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశంలో డివైడర్ కట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
అవసరమైన చోట డివైడర్లు ఏర్పాటు చేయరు కానీ అవసరం లేని చోట ఎలా ఏర్పాటు చేస్తారని తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఎక్కడైనా డివైడర్లు ప్రజల సౌకర్యం, వాహనాల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నిర్మిస్తారు కానీ ప్రజాభిప్రాయాలకు విరుద్ధంగా ప్రచార ఆర్భాటాలే ప్రధాన ధ్యేయంగా నిర్మించడం ఏంటని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే ప్రతిపక్ష నాయకులపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే డివైడర్ను తొలగించాలని డిమాండ్ చేశారు.