చోరీ సోత్తు లాడ్జిలో- సామాన్యుడిగా జనాల్లో కవరింగ్ - Inter State Thief Arrest - INTER STATE THIEF ARREST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 5:14 PM IST
Ongole Police Arrest Inter State Thief in Prakasam District : తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగని ప్రకాశం పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.40 లక్షలతో పాటు ఓ బైకును స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 9న (ఆగస్టు 9న) ఒంగోలు నగరంలోని గుమ్మడి నాగార్జున రావు అనే వ్యక్తి ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని అంతరాష్ట్ర దొంగైన ప్రభు కుమార్ చోరీకి పాల్పడ్డాడు. అతని ఇంట్లో 50 సవర్లు బంగారం, 1,80,000 నగదుతో పాటు ఓ బైకు కూాడా దొంగతనం చేసి పరారయ్యాడు.
బాధితుడు గుమ్మడి నాగార్జున రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సాయంతో దర్యాప్తు చేపట్టారు. అంతరాష్ట్ర దొంగైన ప్రభు కుమార్ దొంగతనం చేసి లాడ్జిలో పెట్టి సామాన్య వ్యక్తిగా జనంలో సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు బృందాలు ఏర్పాడి అతనిపై ప్రత్యేక నిఘా పెట్టి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతనిపై ఒంగోలు నగరంతో పాటు గుంటూరు, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్ ప్రాంతాల్లో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు.