డొక్కు బస్సులతో ప్రయాణికుల ఇక్కట్లు - శిక్ష డ్రైవర్​కా! - RTC Bus Rain Driver - RTC BUS RAIN DRIVER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 10:13 AM IST

Officers Harassed RTC Bus Rain Driver in Kakinada District : ఇటీవల గుంటూరు నుంచి కాకినాడ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ టాప్ నుంచి వర్షం నీరు లీకై డ్రైవర్​తో పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. డ్రైవర్ తడిసి ముద్దవడంతో పాటు ఇంజిన్​పై నీరు పడింది. ఈ క్రమంలో ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​లో కథనాలు వచ్చాయి. ఈ విషయం డ్రైవర్ వెంకటేశ్వర్లు కారణంగానే బయటకు వచ్చిందని భావించిన ఆర్టీసీ అధికారులు అతనిపై ప్రతీకార చర్యలకు పూనుకున్నారు. ఆయనను బస్సు నడిపే విధుల నుంచి తప్పించి కాకినాడ జీజీహెచ్ బల్టర్ వద్ద స్పేర్ ఉద్యోగిగా నియమించారు.

బస్​స్టాండ్​ ముందు నిలబడి అక్కడకు వచ్చే బస్సుల్లో ప్రయాణికులను ఎక్కించడం వంటి పనులు అప్పగించారు. డొక్కు బస్సులతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం మానేసి డిపో అధికారులు సీనియర్ డ్రైవర్​పై వేధింపులకు దిగడం ఆర్టీసీలో చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో ఆ డ్రైవర్​కు ఎలాంటి విధులు అప్పగిస్తారోనని సహచర ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.