కంది చేనులో గంజాయి- గ్రామ శివారులో భారీగా సాగు - ganjai Cultivation in prakasam
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 3:12 PM IST
Officers Destroyed Ganjai Trees Gangupalle: గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న గంజాయి సాగును సెబ్ అధికారులు దాడులు చేసి ధ్వంసం చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గంగుపల్లెలో భారీగా గంజాయి సాగు కలకలం రేపింది. గ్రామ శివారు పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సెబ్ (Special Enforcement Bureau) అధికారులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు.
Cultivation of Cannabis Plants in Kandi Field: కంది పొలంలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్నట్లు సెబ్ ((SEB) అధికారులు గుర్తించి కేసనపల్లి బ్రహ్మయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పొలంలో సాగు చేసిన 270 గంజాయి మొక్కలను అధికారులు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు, రవాణా చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని అధికారులు స్థానికులకు తెలిపారు. గంజాయి సాగుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల: అల్లూరి జిల్లా చెరుకుంపాకల వద్ద రూ.50 లక్షలు విలువ చేసే గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.