ఫోన్ ట్యాపింగ్ కేసు - ఆ ముగ్గురిని విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి : ఎన్వీఎస్‌ఎస్ - TELANGANA PHONE TAPPING CASE - TELANGANA PHONE TAPPING CASE
🎬 Watch Now: Feature Video
Published : Mar 30, 2024, 4:22 PM IST
NVSS Prabhakar on Phone Tapping Investigation : సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూడు రోజుల్లో మాజీ డీజీపిని విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్‌పై మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం కీలక మలుపులు తిరుగుతున్న సమయంలో లోతైన దర్యాప్తు చేయాలన్నారు. మాజీ హోంమంత్రి, మాజీ డీజీపీ, కేటీఆర్‌లలో ఎవరు చెబితే చేశారో తేల్చాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, డీజీపీని విచారణ చేస్తే, అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంటి అని కేటీఆర్ అన్నారని, వెంటనే కేటీఆర్‌ను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అప్పటి డీజీపీ, హోంమంత్రికి తెలియకుండానే జరిగిందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల రాజకీయ ఎత్తుగడలు తెలుసుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇందులో కేసీఆర్ పాత్ర కూడా ఉంటుందని ఆరోపించారు. 100 రోజుల పాలన రెఫరెండమని రేవంత్ అంటున్నారని, అసలు ఏం సాధించారని రెఫరెండం అంటున్నారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో 100 అబద్ధాలు చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒకరిని కాపాడుకునేందుకు ఒకరు పని చేస్తున్నారని ఆరోపించారు.