తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రవాసాంధ్రుల ప్రచారం - NRI Election Campaign for Tdp - NRI ELECTION CAMPAIGN FOR TDP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 10:55 AM IST
NRI Election Campaign for Teleugudesam Party : తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి వచ్చిన తమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలు ధ్వజమెత్తారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్న తమ పార్టీ ఎన్ఆర్ఐ (NRI) విభాగం నాయకుల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు ఎన్డీఏ (NDA) ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నారై విభాగం ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
యువతలో నైపుణ్యాలు పెంచి, యూరప్, అమెరికా, గల్ఫ్ సహా వివిధ దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 'ఎన్‌రైజ్ ఏపీ క్యాంపెయిన్' వాహనాల్ని ఆ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు వేమూరి రవి జెండా ఊపి ప్రారంభించారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తేనే అభివృద్ది సాధ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.