అద్దె చెల్లింపులో జాప్యం: సచివాలయానికి తాళం - బెళుగుప్పలో సచివాలయ భవనానికి తాళం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 10:51 AM IST
Non Payment Of Rent Sachivalayam Building Has Been Locked at Beluguppa: సచివాలయ భవనానికి అద్దె చెల్లించలేదని యజమాని తాళం (Lock) వేసిన ఘటన అనంతపురం జిల్లా చోటు చేసుకుంది. భవన యజమానురాలు నాగమ్మ తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని బెళుగుప్పలో ఒక భవనాన్ని నెలకు రూ. 7,712 చొప్పున అద్దెకు (Rent) తీసుకున్న అధికారులు గ్రామ సచివాలయాన్ని నిర్వహిస్తున్నారు.
భవనానికి 34 నెలలుగా అద్దె చెల్లించకపోవటంతో యాజమాని నాగమ్మ పలుసార్లు సచివాలయ అధికారులను హెచ్చరించారు. నాగమ్మ మండల కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన కరవవ్వడంతో బుధవారం సచివాలయానికి తాళం వేశారు. 30 వేలు మాత్రమే చెల్లించారని, మిగతా అద్దె 2లక్షలకు పైగా బకాయి ఉందని నాగమ్మ పేర్కొన్నారు. ఈ బకాయిని అధికారులు చెల్లించకపోవడంతో సచివాలయానికి భవన యాజమాని నాగమ్మ తాళం వేసి వెళ్లిపోయారు. మొత్తం బకాయిలు చెల్లించేంత వరకూ సచివాలయం తాళం ఇవ్వనని అధికారులకు భవన యాజమాని నాగమ్మ తేల్చి చెప్పేశారు.