బాలలకు మంచి భవిష్యత్తు ఇస్తే మంచి సమాజాన్ని స్థాపించినట్లే: కైలాష్‌ సత్యార్థి - Golden Childhood Program at Ongole

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 29, 2024, 10:17 PM IST

thumbnail
బాలలకు మంచి భవిష్యత్తు ఇస్తే - మంచి సమాజాన్ని స్థాపించినట్లే : కైలాష్‌ సత్యార్థి (ETV Bharat)

Nobel Laureate Kailash Satyarthi Inaugurate Golden Childhood Program : బాలలకు మంచి భవిష్యత్తు కల్పిస్తే మంచి సమాజాన్ని స్థాపించినట్లు అవుతుందని నోబెల్‌ అవార్డు గ్రహీత కైలాష్‌ సత్యార్థి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌ ఆడిటోరియంలో బాలల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన బంగారు బాల్యం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. బాలల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదని కైలాష్‌ అభిప్రాయపడ్డారు. అలాగే సమాజంలో బాలలను నిర్లక్ష్యం చేస్తే వారి జీవితం అంధకారం అవుతుందని తెలిపారు. తద్వారా సమాజం ఉనికే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. బాలలకు కుల, మత, ప్రాంతీయ భేదాలు ఉండవని వెల్లడించారు. వారు ఎక్కడున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న బాలలకు ఉండే హక్కులు ఒకేలా ఉంటాయన్నారు.

ప్రస్తుతం తల్లిదండ్రుల ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా పిల్లలు గాడితప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు. వారు సన్మార్గంలో నడవాలంటే సమాజం వారికి పూర్తి స్థాయిలో రక్షణగా నిలబడాలన్నారు. ప్రకాశం జిల్లా అధికారులు బంగారు బాల్యం కార్యక్రమం చేపట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కైలాష్‌ సత్యార్థితో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.