సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతులు లేవు- వస్తే అరెస్టులే: డీసీపీ - Employee protests in AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 6:08 PM IST
No Permissions for Chalo Vijayawada Program: సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు పోరాటాలు మలిదశకు చేరుకున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తామని మాట తప్పిన జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధమని ఉద్యోగులు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటుతోనే తగిన గుణపాఠం చెబుతామని ఉద్యోగ సంఘాలు నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో సీపీఎస్ ఉద్యోగులు రేపు చేపట్టిన చలో విజయవాడ (CPS employees Chalo Vijayawada program ) సిద్దమవుతున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్ (DCP Srinivas) తెలిపారు. ప్రస్తుతం నగరంలో ఉన్న పరిస్ధితుల దృష్ట్యా సీపీఎస్ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతులు ఇవ్వడం కుదరదన్నారు. చలో విజయవాడకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు లేనందు వల్ల సీపీఎస్ ఉద్యోగులు ఎవరు విజయవాడకు రావద్దని ఆయన సూచించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 అమలులో ఉన్నాయని పెర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరు చలో విజయవాడలో పాల్గోనొద్దని ఆయన సూచించారు. పోలీసుల నిబంధనలు ఉల్లంఘించి పాల్గొంటే అరెస్టులు తప్పవని డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు.