పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోండి - సీఎస్‌కు లేఖరాసిన నిమ్మగడ్డ - Nimmagadda writes letter to CS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 5:58 PM IST
Nimmagadda Ramesh Kumar Writes Letter to CS : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫించను లబ్ధిదారులకు డబ్బులు అందించేందుకు వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయా మార్గాలను అన్వేషించాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ సీఎస్‌కు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియామవళి ముగిసే వరకు అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయాంగా ఫించన్లు చేల్లించే విధంగా అధికారులకు తగు సూచనలు చేయలని కోరారు. రేపటి నుంచి పింఛన్ల చెల్లింపులు జరగాల్సి ఉంది. ప్రతి గ్రామంలోనూ పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. కాబట్టి వారి సేవలను ఇందుకు యుద్ధప్రాతిపదికగా వినియోగించాలని తెలిపారు.
వృద్ధులు, అస్వస్థతకు గురైన వారిపై ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. తద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అలాగే ప్రజాపంపిణీ విషయానికొస్తే ఇప్పటికే వాటిని పౌరసరఫరాల వ్యాన్ల ద్వారా డెలివరీ చేస్తున్నారని లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేరవేయాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకంలో జిల్లా కలెక్టర్లు, పాలనా యంత్రాంగం పింఛన్లను పంపిణి చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలని నిమ్మగడ్డ రమేష్ లేఖ పేర్కొన్నారు.