LIVE: రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టులపై ఎన్టీఏ కూటమి నేతల మీడియా సమావేశం - NdA alliance leaders live - NDA ALLIANCE LEADERS LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 3, 2024, 10:10 AM IST
|Updated : May 3, 2024, 10:44 AM IST
LIVE : ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకంపేటలో బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. తాను జలవనరులశాఖ మంత్రిగా ఉండగా ఈ ప్రాజెక్టు మంజూరైందని, రూ.60 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు సార్లు పోలవరాన్ని సందర్శించానని గుర్తు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో గోదావరి నుంచి ఏటా 1300 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతోందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో హెలికాప్టర్‌లో పర్యటించినప్పుడు చాలా భూములు బీడుగా కనిపించాయని, నీటి వనరుల లభ్యత పుష్కలంగా ఉన్నా వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోయారని పేర్కొన్నారు. ‘వైసీపీ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదులను అనుసంధానిస్తే విలువైన నీటిని సంరక్షించొచ్చు. ఇది పూర్తయితే దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయి. గతంలో వివిధ రాష్ట్రాల మధ్య 23 జలవివాదాలు ఉంటే వాటిల్లో 17 పరిష్కరించాం’ అని గడ్కరీ చెప్పారు. దేశంలో నీటి సమస్యలను పరిష్కరించడానికి జాతీయ స్థాయిలో ‘ప్రధానమంత్రి సుజల యోజన’ తీసుకొస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా రూ.35 వేల కోట్లతో విశాఖ-రాయ్‌పుర్ మధ్య రహదారి, రూ.22 వేల కోట్లతో రాజమహేంద్రవరం-విజయనగరం మధ్య హరిత రహదారి పనులు చేస్తున్నామని అన్నారు. ‘దూరదృష్టి లేని, అవినీతిమయమైన ప్రభుత్వం వల్లే ఏపీలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది. సంక్షేమ పథకాలు అవసరమే అయినప్పటికీ ఉద్యోగ కల్పనా కీలకమే. కూటమి ప్రభుత్వంతోనే యువతకు ఉద్యోగాలొస్తాయి’ అని చెప్పారు. మంచి నాయకులను ఎన్నుకుంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, కూటమి నాయకులను గెలిపించుకోవాలని సూచించారు.రాష్ట్రంలోని జలవనరుల ప్రాజెక్టులపై ఎన్టీఏ కూటమి నేతల మీడియా సమావేశం
Last Updated : May 3, 2024, 10:44 AM IST