పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: నారా లోకేశ్ - నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 9:38 PM IST

Nara Lokesh thanked everyone for birthday wishes: తన పుట్టిన రోజుని ఓ పండ‌గ‌లా జ‌రిపిన ప్రతీ ఒక్కరికీ కృత‌జ్ఞత‌లు తెలియ‌జేస్తున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేప‌ట్టి స్ఫూర్తిగా నిలిచిన తెలుగుదేశం నేత‌లు, కార్యక‌ర్తలు, అభిమానులు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. తన జ‌న్మదినం జ‌నానికి ఉప‌యోగ‌ప‌డేలా వివిధ సేవా కార్యక్రమాలు చేప‌ట్టడం వ‌ల్ల తన జ‌న్మ సార్థక‌మైంద‌ని లోకేశ్ పేర్కొన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలిపిన అంద‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞత‌లు తెలియజేశారు. అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు తనకు కొండంత బ‌లమని, తన జీవితం ప్రజాసేవ‌కే అంకితమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.  

11 వందల కేజీల కేక్: మంగళగిరి ఎన్టీఆర్ భవన్‌లో లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా 11 వందల కేజీల కేక్​ను కట్ చేసిన టీడీపీ కార్యకర్తలు, లోకేశ్ అభిమానులకు పంచిపెట్టారు. అలాగే పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అదే విధంగా చిరువ్యాపారులకు బడ్డీకొట్లను అందజేశారు. లోకేశ్ ఆయురారోగ్యాలతో ఉండాలని మత పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. లోకేశ్ జన్మదిన వేడుకల్లో ఓ తెలుగుదేశం కార్యకర్త ఎన్టీఆర్ వేషధారణలో అలరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.