LIVE: పుట్టపర్తిలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగ సభ - ప్రత్యక్షప్రసారం - Nara Lokesh Sankharavam live
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 10:22 AM IST
|Updated : Mar 8, 2024, 11:17 AM IST
Nara Lokesh Sankharavam Live : హిందూపురంలోని జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26 వేలమంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మంది బీసీలను ఏకంగా హత్యచేశారని మండిపడ్డారు. ఇదేనా బీసీలకు ఇచ్చే గౌరవం అని జగన్‌ను ప్రశ్నిస్తున్నానన్నారు.ప్రజలంతా రెండు నెలలు ఓపిక పట్టండని, దొంగ కేసులన్నీ ఎత్తివేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీలకు రావాల్సిన 25 వేల కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెలా 4 వేల రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేశ్, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు.అదే విధంగా ఆదరణ పథకం కోసం 5 వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం తన కుటుంబాన్ని ఆశీర్వదించిందని, ఎమ్మెల్యేగా బాలకృష్ణ 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైపులైను వేసి హిందూపురానికి తాగునీరు అందించామన్నారు. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను క్యాన్సర్ మాదిరిగా తినేస్తున్నారని విమర్శించారు. టీడీపీ- జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని అన్నారు.పుట్టపర్తిలో నారా లోకేశ్ శంఖారావం బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం మీ కోసం
Last Updated : Mar 8, 2024, 11:17 AM IST