వరద బాధితులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల విరాళం - మంత్రి లోకేశ్ హర్షం - NUZVID IIIT STUDENTS DONATION - NUZVID IIIT STUDENTS DONATION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2024, 2:45 PM IST
IIIT Students Donation to Vijayawada Flood Victims : సామాజిక బాధ్యతతో విజయవాడ వరద బాధితులకు 1565 మంది నూజివీడు IIIT విద్యార్థులు, పూర్వ విద్యార్థులు యోగా గురువు శ్రీధర్ ఆధ్వర్యంలో రూ. 2,82,313 విరాళంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. విద్యార్థులు పెద్ద మనసుతో ముందుకు వచ్చి సాయం చేయడం చాలా సంతోషమని విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇంతమంది బాధితులకు అండగా నిలవడం చాలా గొప్ప విషయమని, ఈ సందర్భంగా వారందరినీ ఆయన ప్రశంసించారు. అదే విధంగా ఈ విరాళాన్ని సేకరించిన శ్రీధర్‌ను సైతం మంత్రి అభినందించారు. ట్రిపుల్ ఐటీలో విద్య, మౌలిక సౌకర్యాలకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించి తన చెల్లెళ్లు, తమ్ముళ్ల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే బాధ్యత తనదని లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని ఉద్యోగాల కల్పనకు సంబంధించి తాము కృషి చేస్తున్నామని అన్నారు.