చంద్రబాబు వెన్నంటే నిలిచిన వారి రుణం తీర్చుకుంటాం: నారా భువనేశ్వరి - BHUVANESWARI Third Day in KUPPAM - BHUVANESWARI THIRD DAY IN KUPPAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 25, 2024, 10:34 PM IST
Nara Bhuvaneswari Third Day Tour in Kuppam Constituency : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మరోసారి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు నారా భువనేశ్వరి కుప్పానికి వెళ్లారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు కుప్పంలోని శాంతిపురం, రామకుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. మహిళలతో ముఖాముఖి సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను మెుత్తం ఖాళీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఖజానాలో పైసా లేకపోగా, లక్షల కోట్లు అప్పులు మిగిల్చారని దుయ్యబట్టారు.
క్లిష్ట పరిస్థితుల్లోనూ చంద్రబాబు రాష్ట్ర పాలనను గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పింఛన్ల సాయాన్ని పెంచి ఒకటో తేదీన ఇంటి వద్దకు వచ్చి ఇస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు అనే ఆయుధంతో వైసీపీను తరిమికొట్టారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కష్ట కాలంలో చంద్రబాబు వెన్నంటే నిలిచిన తెలుగుదేశం కార్యకర్తల రుణాన్ని తీర్చుకుంటామని భువనేశ్వరి పేర్కొన్నారు.