ఎదురుదాడి కాదు - సునీత, దస్తగిరి ప్రశ్నలకు సమాధానమివ్వండి: టీడీపీ నేత నాగుల్ మీరా - టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 7:07 PM IST
Nagul Meera Comments on YSRCP Government : బాబాయ్ హత్య కేసు గురించి మాట్లాడే వారిపై ఎదురుదాడి చేయడం కాదు, జగన్ రెడ్డి వివేకా కుమార్తె సునీత, దస్తగిరి లాంటి వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా ప్రశ్నించారు. వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న జగన్ రెడ్డి తర్వాత కోర్టులో వేసిన పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నాడని నిలదీసారు. సీబీఐ వాళ్లు అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసులతో ఎందుకు రక్షణ కల్పించారని ప్రశ్నించారు.
వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ తేల్చినా జగన్ తన తమ్ముడిని కాపాడుకోవడానికి దిల్లీలో తిరిగింది నిజం కాదా అని నాగుల్ మీరా ధ్వజమెత్తారు. బాబాయ్ ను చంపిన వారిని సీఎం జగన్నే కాపాడుతున్నారని సామాన్య ప్రజలే అంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌కు మానవత్వం ఉంటే తన బాబాయ్‌ని చంపిన దోషుల్ని కాపాడే ప్రయత్నాలు ఇకనైనా విరమించుకోవాలని హితవు పలికారు. జగన్ రాష్ట్రాన్ని నేరాలకు కేంద్రంగా మార్చారని ఆరోపించారు. జగన్ రెడ్డికి మళ్లీ ఓటేస్తే ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలవుతాయని హెచ్చరించారు.