టీడీపీ-జనసేనను పొత్తును విడదీయడం ఎవరి తరం కాదు : నాగబాబు - Nagababu

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 2:52 PM IST

Nagababu Comments: టీడీపీ - జనసేన కూటమీపై అధికార పార్టీ చేస్తున్న కుట్రలపై ఆ పార్టీ నేత నాగేంద్రబాబు స్పందించారు. తెలుగుదేశం - జనసేన పొత్తును విడదీయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం తండేవలసలో ఓ పార్టీ కార్యక్రమానికి నాగబాబు హజరైయ్యారు. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటించిన ఆయన త్వరలో పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ఉండవచ్చు అని నాగబాబు తెలిపారు. ఇరుపార్టీల అంగీకారంతోనే జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని నాగబాబు చెప్పారు. 

చంద్రబాబు, పవన్​ కల్యాణ్​లు చాలా స్పష్టంగా, చక్కగా ముందుకు వెళ్తున్నారని వివరించారు. జగన్​, పవన్​ అంటే గిట్టని వాళ్లు ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఎన్నో మాట్లాడుతుంటారని అన్నారు. అంతే తప్పా ఏం లేదన్నారు. కొద్ది రోజులు పోతే పూర్తిగా ప్రజల్లో గందరగోళం ఏమి ఉండదని తెలిపారు. ప్రజల్లో కూటమిపై ఓ అవగాహన ఉందని వివరించారు. టీడీపీ - జనసేనను విజయవంతం చేయడానికే కృషి చేస్తామని వివరించారు. తాము తప్పకుండా విజయం సాధిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.