బీజేపీతోనూ కలిసి వెళ్లాలనేది పవన్ ఆకాంక్ష : నాదెండ్ల మనోహర్ - janasena
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 2:12 PM IST
Nadendla Manohar on TDP Janasena Meeting : జనసేన, టీడీపీతో బీజేపీ కలవాలని పవన్ ఆకాంక్షిస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం అవసరం ఉంటుందనే విషయాన్ని నాదెండ్ల మనోహర్ నొక్కి చెప్పారు. ఈ నెల 28న జనసేన - టీడీపీ బహిరంగ సభ ఉంటుందని, ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొనే ఈ సభా వేదికపై ఉమ్మడి ప్రణాళిక, కార్యాచరణను వెల్లడించబోతున్నాం అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తమ కలయిక రాజకీయ లబ్ధి కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రజల ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా వాడుకుంటారు? : జగన్ అధికారం నుంచి వైదొలిగే సమయంలోనూ జగన్ ఖజానా ఖాళీ చేస్తున్నారని మనోహర్ ధ్వజమెత్తారు. ప్రజల ధనంతో జగన్ హెలికాప్టర్లు ఎలా సమకూర్చుకుంటారు? అని ప్రశ్నించారు. హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ, ప్రజా ధనం ఎలా వాడతారు? అని నాదెండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు.