3వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు చెల్లించాలి: నాదెండ్ల - Nadendla Manohar Key comments - NADENDLA MANOHAR KEY COMMENTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-04-2024/640-480-21119885-thumbnail-16x9-nadendla.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 5:13 PM IST
Nadendla Manohar Key comments on YSR Aasara pension: వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ చేపట్టవద్ధని కేంద్ర ఎన్నికల ఆదేశిస్తే, ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏమిటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకోవటంలో తప్పు లేదన్నారు. వాలంటీర్లు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగమంతా ఏం చేస్తోందని, వారి ద్వారా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. మూడో తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆసరా పెన్షన్స్ చెల్లించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో ప్రభుత్వాధికారులు పెన్షన్ల పంపిణీ చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, చంద్రబాబు చెప్పారని పెన్షన్లు ఆపుతున్నట్లు వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. జనసేన వాలంటీర్లను గౌరవిస్తుందని, వైసీపీ వాలంటీర్ వ్యవస్థను కించపరిచే చర్యలకు పూనుకుంటుందని నాదెండ్ల విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 3వ తేదీన తెనాలిలో పర్యటించి రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారని నాదెండ్ల వెల్లడించారు.