ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకలితో అలమటిస్తున్న రోగులు - Patients Problems in Mylavaram - PATIENTS PROBLEMS IN MYLAVARAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 26, 2024, 7:15 PM IST
Mylavaram Hospital Food Problem: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఆహారం అందించకపోవడంతో వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందిని ప్రశ్నిస్తే గ్యాస్ లేదని చెప్తున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం లేకపోవడంతో ఆకలితో అవస్థలు పడ్డామని రోగులు తెలిపారు. కొంతమంది డబ్బులు ఉన్నవారు బయట నుంచి తెచ్చుకోగా, డబ్బులు లేని వారు ఆకలితో అలమటించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది.
గత ప్రభుత్వంలో బకాయిలను చెల్లించకపోవడంతోనే కాంట్రాక్టర్లు సమయానికి ఆహారం అందించలేక ఇబ్బంది పడుతున్నారని అధికారులు తెలిపారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ, పేషెంట్లకు ఇచ్చే ఆహారం పట్ల ఎప్పుడూ అశ్రద్ధ వహించలేదని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇక ముందు ఈ విధంగా జరగనివ్వమని, ఏజెన్సీలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. త్వరలోనే బకాయిలు క్లియర్ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.