ప్రతి ఒక్కరూ, సక్రమంగా, వివేకంతో ఓటును వినియోగించుకోండి : మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ - అవనిగడ్డ టీడీపీ కార్యాలయం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 4:45 PM IST
My First Vote for CBN Program in Krishna District : ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరూ సక్రమంగా, వివేకంతో ఓటును వినియోగించుకోవాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ తెలుగుపార్టీ కార్యాలయంలో జరిగిన " మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ " కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బ్రోచర్‌ను కూడా విడుదల చేశారు.
నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వారికి ఓటేయాలని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. ఓటు వేసే ముందు ఎవరికి, ఎలాంటి వారికి వేయాలని ఆలోంచించుకోవాలని చెప్పారు. మన గ్రామం, జిల్లా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఓటు వేయాలని కోరుకున్నారు. అటువంటి విజన్ గల నాయకుడు చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. 78 ఏళ్లు వయస్సులో కూడా యువత భవిత కోసం ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని చెప్పారు. ఎన్నికల ప్రలోభాలకు లోనుకాకుండా ఓటును ఎవరు అమ్ముకోవద్దని, ప్రజలకు మేలు చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.