మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం- 4 శాతం రిజర్వేషన్ల కొనసాగింపుపై ముస్లిం సంఘాల హర్షం - Palabhishekam to Nara Lokesh Photo - PALABHISHEKAM TO NARA LOKESH PHOTO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 4:13 PM IST
|Updated : Jun 10, 2024, 5:19 PM IST
Muslim Minority Leaders Palabhishekam to Nara Lokesh Photo: ముస్లింకు 4 శాతం రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలపటంపై మైనార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని వన్ టౌన్ కూడలిలో లోకేశ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక స్థితిగతులు మారుస్తానని లోకేశ్ చెప్పటం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర యువతకు స్ఫూర్తి ప్రదాతైన యువ నేత నారా లోకేశ్ అడుగుజాడల్లో తామందరం నడుస్తామని మైనార్టీ నేతలు స్పష్టం చేశారు.
"ముస్లింకు 4 శాతం రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తామని నారా లోకేశ్ తెలపటం చాలా సంతోషం. మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక స్థితిగతులు మారుస్తానని లోకేశ్ చెప్పటం ఆనందంగా ఉంది. మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం. రాష్ట్ర యువతకు స్ఫూర్తి ప్రదాతైన యువనేత నారా లోకేశ్ అడుగుజాడల్లో మేమంతా నడుస్తాం." - మైనార్టీ నాయకులు