వేతనాల కోసం మరోసారి రోడెక్కిన మున్సిపల్ కార్మికులు - municipal workers protest at guntur - MUNICIPAL WORKERS PROTEST AT GUNTUR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 7:56 PM IST
Municipal Workers Agitation On Salary at Guntur: ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు బకాయి ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించకపోతే సమ్మె మరింత ఉద్ధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సకాలంలో జీతాలు చెల్లించాలంటూ సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఏప్రిల్ 15వ తేదీ వచ్చినప్పటికీ మార్చి నెల జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేసిన రోజులకు కూడా జీతాలు చెల్లిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు చెల్లించలేదని వాపోయారు. బకాయిలో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నలుగురు చేసే పని ఒక్కరితో చేయిస్తూ కూడా జీతాలు సక్రమంగా ఇవ్వటం లేదని కార్మికులు వాపోయారు. ఎండలు ఎక్కువైనప్పటికీ సెలవులు ఇవ్వటంలేదని కార్మికులకు అనారోగ్యం తలెత్తితే ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు.