సిద్ధం చివరి సభకు భారీగా ఏర్పాట్లు : విజయసాయిరెడ్డి - YCP siddham meetings

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 7:40 PM IST

MP Vijayasai Reddy on Siddham Sabha in Medaramatla: సిద్ధం సభను వచ్చే నెల 3న ప్రకాశం జిల్లా మెదరమెట్లలో నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో మూడు జిల్లాల స్థాయి సమావేశం నిర్వహించారు. నెల్లూరు, తిరుపతి, ఒంగోలు లోకసభ పరిధిలోని అసెంబ్లీ నేతలతో నెల్లూరులో సమావేశం నిర్వహించారు. సభ ఏర్పాట్లపై చర్చించినట్లు తెలిపారు. 

నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలను ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలో వివరిస్తారని తెలిపారు. మూడు సిద్ధం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలకు లక్షలాది మంది తరలి వచ్చారని అన్నారు. మెదరమెట్లలో జరిగే చివరి సభకు 15 లక్షల మందికి పైగా వైసీపీ శ్రేణులు వస్తారని తెలిపారు. 2024 నుంచి 2029 లో ఏమి చేయబోతున్నారో జగన్ వివరిస్తారని అన్నారు. నెల్లూరు లోక్​సభకు శరత్ చంద్రా రెడ్డి పోటీ చేయరని స్పష్టం చేశారు. వచ్చే వారంలో నెల్లూరు లోక్​సభ అభ్యర్థిని నిర్ణయిస్తామని అన్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లా అధ్యక్షుడిని నియమిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.