టీడీపీ ప్రచార రథంపై అల్లరి మూకల దాడి- ఖండించిన టీడీపీ నేతలు - MOB ATTACK ON TDP CAMPAIGN VEHICLE - MOB ATTACK ON TDP CAMPAIGN VEHICLE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 9:41 AM IST
Mob Attack On Tdp Campaign Vehicle at Guntur: వైఎస్సార్సీపీ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. అధికార పార్టీ అండ చూసుకుని అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం సమీపంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథంపై వైఎస్సార్సీపీ అల్లరి మూకలు ఆదివారం రాళ్లదాడి చేశాయి. ఈ రాళ్ల దాడిలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక వైఎస్సార్సీపీ నాయకులు రెచ్చగొట్టి రాళ్ల దాడి చేయించారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు చెందిన ప్రచార వాహనం కొన్నాళ్లుగా గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది చేరుకుని ఒక్కసారిగా వాహనంపైకి రాళ్లు విసిరారు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న మేడికొండూరు టీడీపీ నాయకులు వాహనాన్ని పరిశీలించి మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్‌ఐ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.