కడప హోంగార్డులను బదిలీ చేయాలి- ఈసీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి లేఖ - MLC Bhumiredd on Home Guards - MLC BHUMIREDD ON HOME GUARDS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 7:23 PM IST
MLC Bhumiredd Ramgopal Reddy on Home Guards : కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోం గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీగా వ్యవహరించిన వారిని కడపలో హోం గార్డులుగా నియమించారని భూమిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. వారు అధికారులను తప్పుదారి పట్టించి, అలాగే ఎన్నికల విషయాలను వైఎస్సార్సీపీ (YSRCP) నాయకులకు చేరవేసే అవకాశం ఉందని తెలిపారు. ఆ సిబ్బందిని ఇతర జిల్లాలకు పంపాలని లేకుంటే ఎన్నికల విధుల నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండాలని, రాష్ట్రమంతా ఎన్నికలు (Elections) పారదర్శకంగా జరగాలని ఈసీ చర్యలు చేపడుతున్నప్పటికీ జగన్ ఎత్తుగడలు ఆపడం లేదని పలు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాస్తున్నట్లు ఎమ్మెల్సీ భూమిరెడ్డి తెలిపారు.