నిరుద్యోగుల కోసం ఉచిత మెగా డీఎస్సీ శిక్షణ - ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు - SRINIVASULU START FREE DSC TRAINING - SRINIVASULU START FREE DSC TRAINING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 9:46 PM IST
MLA Srinivasulu Started Free Mega DSC Training Center : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలోని టెక్స్ టైల్స్ పార్కులో సొంతంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా డీఎస్సీ శిక్షణ సెంటర్ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు పొందలేక జీవితాల్లో సతమతమవుతున్న నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగం సాధించి ఉపాధ్యాయులు కావాలని కోరారు.
మెగా డీఎస్సీలో ప్రతిభ చాటి ఉద్యోగం సాధించడంతో పాటు సమాజానికి మీ సేవలు ఉపయోగపడే విధంగా ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అభ్యర్థులు హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లి శిక్షణ తీసుకోలేని అభ్యర్థుల కోసం ఉచిత మెగా డీఎస్సీ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రూప్స్ పరీక్షలకు శిక్షణ ఇప్పించినట్లు శ్రీనివాసులు గుర్తు చేశారు. మెగా డీఎస్సీలో రాయదుర్గం ప్రాంతానికి తగిన వాటా రావాలనే అభ్యర్థుల కోసం అనుభవం ఉన్న అధ్యాపకులను రప్పించామన్నారు.