ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి- సీజనల్‌ వ్యాధులపై అవగాహనకు డ్రైడే - MLA in Dengue Awareness Programme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 19, 2024, 3:34 PM IST

thumbnail
ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి- సీజనల్‌ వ్యాధులపై అవగాహనకు "డ్రైడే" (ETV Bharat)

Friday Dry Day Seasonal Diseases Awareness Programme in NTR District : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వారానికి ఒకరోజు ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న మురుగు నీటిని శుభ్రం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని రామకృష్ణాపురంలో ఫ్రైడే డ్రైడే పేరిట నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్‌, రెవెన్యూ, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా రోగాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించడమే ర్యాలీ ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు​ సహా పలువురు పాల్గొన్నారు.  

డెంగ్యూ నివారణే ఉత్తమ రక్షణ గా సమాజ భాగస్వామ్యంతో నిర్వహిద్దాం అంటూ నినదించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దోమలపై దండయాత్రతో సత్ఫలితాలు సాధిస్తే, జగన్ ప్రభుత్వం ఎగతాళి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గుర్తు చేశారు. పరమేశ్వరరావు రోడ్డు నుంచి మహానాడు రోడ్డు వరకూ 20 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్లకు ఎంపీ కేశినేని చిన్ని, గద్దె రామ్మోహన్​ శంకుస్థాపన చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.