ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి నిర్వాకం - అడ్డుగా ఉందని రాత్రికి రాత్రే డివైడర్ తొలగింపు - ఎమ్మెల్యే కాసు మహేశ్ అక్రమాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 9, 2024, 7:29 PM IST
MLA Kasu Mahesh Reddy Illegal Construction: అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండాపోతోంది. ప్రజాహితం కోసం ఏర్పాటు చేసిన రోడ్ల రూపురేఖలను సైతం దౌర్జన్యంగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. అర్ధరాత్రి వేళ అక్రమాలకు దిగుతూ రాత్రికి రాత్రే పనులు చక్కపెట్టేసుకుంటున్నారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీకి చెందిన నేత తన వాణిజ్య సముదాయానికి అడ్డుగా ఉందని ప్రధాన రహదారిలోని డివైడర్నే మాయం చేశారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో గురజాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ వాణిజ్య సముదాయ దారికి, రహదారిపై ఉన్న డివైడర్‌ను అడ్డుగా ఉందని గురువారం అర్థరాత్రి తొలగించారు. డివైడర్‌ను తొలగింపుతో కాంప్లెక్స్‌కు అనుకూలంగా దారిని ఏర్పాటైంది. ఇంత జరుగుతున్నా నరసరావుపేట మున్సిపల్ అధికారులు తమకేమీ పట్టనట్లుగా చూస్తు ఊరుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని, అధికార పార్టీ నేతలకు చెందినది కావడంతోనే ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఇప్పటి ప్రభుత్వం మారితే నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతాయని పనులు చక్కబెట్టుకుంటున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.