అన్నవరంలో 'వందేభారత్'ని ఆపాలని విన్నపం - Vande Bharat At Annavaram - VANDE BHARAT AT ANNAVARAM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-09-2024/640-480-22557650-thumbnail-16x9-mla-and-mp-request-to-stop-vande-bharat.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 1:01 PM IST
MLA And MP Request To Stop Vande Bharat At Annavaram : అన్నవరంలో వందేభారత్ ట్రైన్కి స్టాప్ కల్పించేందుకు కృషి చేయాలని ఎంపీలు ఉదయ్ శ్రీనివాస్, పుట్టా మహేష్ యాదవ్‌ని తుని ఎమ్మెల్యే (MLA) దివ్య కోరారు. ఈ మేరకు ఇరువురు ఎంపీలకు లేఖ రాశారు. ప్రముఖ ఆలయాల్లో ఒకటైన అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి నిత్యం వేల మంది వస్తుంటారని లేఖలో పేర్కొన్నారు. సత్యదేవుని ఆలయం సమీపంలో తలుపులమ్మ ఆలయం కూడా ఉందని తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లి వందేభారత్ రైలుని అన్నవరంలో నిలిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నవరంలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో వేలాది మంది భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే దివ్య ఎంపీలు వివరించారు. రైల్వేశాఖ దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.