హైకోర్టు బెంచ్‌ను త్వరలో కర్నూలుకు తీసుకొస్తాం : మంత్రి టి.జి. భరత్ - TG Bharath criticized YCP - TG BHARATH CRITICIZED YCP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/640-480-21835034-thumbnail-16x9-tg.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 30, 2024, 10:33 PM IST
Minister TG Bharath criticized Previous YCP Government : ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పరిశ్రమలశాఖ మంత్రి టి.జి.భరత్ అన్నారు. కర్నూలులో నిర్వహించిన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వైద్యులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా మారయని విమర్శించారు. ఆసుపత్రులలో సరైన సదుపాయలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అలాంటి విధానానికి స్వస్తి పలికి ప్రైవేటు ఆసుపత్రులతో పోటీ పడేటట్లు చేస్తామని తెలిపారు.
అలాగే గతంలో వైసీపీ విధానాలతో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరు ముందుకు రాలేదని విమర్శించారు. తను పరిశ్రమలు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను త్వరలో తీసుకుని వస్తామని మంత్రి భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాల్గొన్నారు.