పోలింగ్ బూత్లోనూ మంత్రి గారి వెంటే మంది మార్బలం- అడ్డుకున్న టీడీపీ శ్రేణులు - MINISTER ENTERED POLLING BOOTH - MINISTER ENTERED POLLING BOOTH
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/640-480-21460758-thumbnail-16x9-clashes-between-tdp-and-ycp-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 9:52 PM IST
Clashes Between TDP and YCP Leaders: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పి.ఎం. పురంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలోకి మంత్రి సీదిరి అప్పలరాజు వెళ్తుండగా ఆయనతో పాటు నలుగురు వైసీపీ నేతలు వెళ్లేందుకు యత్నించారు. అది చూసిన టీడీపీ శ్రేణులు మంత్రి అప్పలరాజుతో వాగ్వాదానికి దిగారు. అభ్యర్థిగా ఉన్న మీరు మాత్రమే పోలింగ్ కేంద్రం లోపలకి వెళ్లాలని మీ పార్టీ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు వీలు లేదని తేల్చి చెప్పారు.
వైసీపీ నేతలు ఎవరు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లినా తాము కూడా బూత్ లోపలకి వస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు. దీంతో అక్కడ ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగి స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి సద్ధుమణిగింది. ఎన్నికల వేళ వైసీపీ నేతలు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియను జరగనివ్వకుండా ఓటర్లు, ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.