వచ్చే ఏడాదిలోగా ఖాదీ బోర్డు ద్వారా 25 వేల ఉద్యోగాలు :మంత్రి సవిత - Minister Savita Review Meeting - MINISTER SAVITA REVIEW MEETING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 3, 2024, 5:15 PM IST
Minister Savita Review Meeting With Khadi &Village Industries Commission : గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత చెప్పారు. వచ్చే ఏడాదిలోగా ఖాదీ బోర్డు ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. మంగళగిరిలోని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమలశాఖ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆప్కో దుకాణాల్లో చీరల నాణ్యతను పరిశీలించారు. గోదాముల్లో మగ్గుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. అమ్ముడుపోని చేనేత వస్త్రాలను రాయితీపై విక్రయించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా యువతకు సరైన ఉపాధి లేకపోవడంతో గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలయ్యారని ధ్వజమెత్తారు. గ్రామీణ స్థాయిలో యువతకు ఉపాధి కల్పించేందుకు 8వ తరగతి చదువు విద్యార్హతతో 5లక్షల నుంచి 50 లక్షల వరకు రుణాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. 26 జిల్లాలో యువతకు శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే ఏడాదిలో 25వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమన్నారు.